ప్రధాని పిలుపుపై అసదుద్దీన్ ఫైర్

by Shamantha N |
ప్రధాని పిలుపుపై అసదుద్దీన్ ఫైర్
X

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు అన్నీ ఆర్పేసీ, ఇంటి ఆవరణలో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. దేశ ప్రజల జీవితాలను 9 నిమిషాలకు కుదించివేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ దేశం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కాదంటూ ట్వీట్ చేశారు. ఈ దేశ ప్రజలకు ఎన్నోఆశయాలు ఉన్నాయి వాళ్లు తమ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారు. అలాంటి వారిని మీ జిమ్మిక్కులతో మోసం చేయొద్దంటూ అసద్ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రకటనలు కాకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఎంత సాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ట్యూబ్ లైట్ ఐడియా ఎక్కడా కనలేదు, వినలేదు. దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అలమటిస్తూ, గూడు లేక కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. ప్రధాని గారు, ఎక్కడుంది మీరు చెబుతున్న వెలుగు? వలస కార్మికుల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలమవుతాయని మీ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కానీ మీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ భారత్ లో సామాజిక సంక్రమణం ద్వారా కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనని చెబుతోంది. ఆర్థికసాయం అందించాలని సీఎంలు కోరుతుంటే లైట్లు ఆర్పివేయాలని చెబుతారా..? అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

Tags:pm modi,Majlis,mp asududdin Ovaisi,fire,social media

Advertisement

Next Story

Most Viewed