Ration Rice Case: పేర్నినానికి బెయిల్ వస్తుందా.. రాదా..?

by srinivas |
MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani)కి చెందిన గోదాములో రేషన్ బియ్యం(Ration Rice) మాయం అయిన విషయం, కేసు నమోదు అయిన తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉంది. దీంతో పేర్ని నాని భార్యను ఇప్పటికే విచారించారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది. అయితే పేర్ని నాని బెయిల్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. రేషన్ బియ్యం మాయం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

మరోవైపు కేసు నమోదు అయిన నాటి నుంచి పేర్ని నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. దీంతో విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన లేక పోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. సేమ్ ఇలానే పేర్ని జయసుధ విషయంలోనూ ఇలానే జరగడంతో ఆమె కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం పోలీసుల విచారణకు హాజరయ్యార. మరి పేర్ని నాని అంశంలో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed