- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో హాఫ్ సెంచరీ బర్త్‌డే.. కానుకగా ఐస్‌క్రీమ్!
దిశ, ఫీచర్స్ : మనిషి జీవితంలో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అందులోనూ తాను భూమ్మీద పురుడుపోసుకున్న రోజు మరింత ప్రత్యేకం కాగా, అది యాభైవ పుట్టినరోజైతే మెమొరబుల్ డేగా చెప్పొచ్చు. ఓ ఆస్ట్రోనాట్ తన హాఫ్ సెంచరీ బర్త్‌డేను అంతరిక్ష కేంద్రంలో జరుపుకోనుండగా, ఈ సందర్భంగా అతడికి స్పెషల్ ఐస్‌క్రీమ్‌తో పాటు ఇతర కానుకలు కూడా తాజాగా అందాయి. ఇంతకీ అతడికి ఆ గిఫ్ట్స్ ఎలా రీచ్ అయ్యాయి? అక్కడికి ఎవరు తీసుకెళ్లారు అని బుర్రకు పదునుపెడుతున్నారా?
స్పేస్‌ఎక్స్ కార్గో డెలివరీ సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోగా.. 4,800 పౌండ్లకు పైగా (2,170 కిలోగ్రాముల) సరఫరా సామగ్రితో పాటు అవోకాడోలు, నిమ్మకాయలు, చీమలు, ఉప్పునీటి రొయ్యలు, ఐస్‌క్రీమ్‌తో సహా తాజా ఆహారాన్ని అంతరిక్ష కేంద్రంలోని ఏడుగురు వ్యోమగాములకు తీసుకెళ్లింది. అంతేకాదు కొన్ని మొక్కలను అక్కడ టెస్ట్ చేసేందుకు పంపించగా, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జన్యు పరిశోధనలో ఉపయోగించే మొక్కలను పంపించారు. ఓ జపనీస్ స్టార్ట్-అప్ కంపెనీ ప్రయోగాత్మక రోబోటిక్ ఆర్మ్‌ను పంపించగా, అది దాని కక్ష్యలో తొలిసారిగా వస్తువులను స్క్రూ చేయడానికి ప్రయత్నించనుండగా, సాధారణంగా వ్యోమగాములు చేసే ఇతర పనులను కూడా ఈ ఆర్మ్ చేస్తుంది. తొలిసారిగా అంతరిక్ష కేంద్రం లోపల దీన్ని టెస్ట్ చేయనున్నారు. ఇక నాసా వ్యోమగామి, ఫ్లైట్ ఇంజనీర్ మేగాన్ మెక్‌ఆర్థర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తన 50వ పుట్టినరోజున ఐస్‌క్రీమ్ కానుకతో జరుపుకుంది. ఇంతకు ముందు తన పుట్టినరోజు కోసం ఎవరూ తనకు అంతరిక్ష నౌకను పంపలేదని, ఇది తన జీవితంలో మర్చిపోలేని బర్త్ డేగా నిలిచిపోనుందని రేడియో ప్రసారంలో తెలిపింది.