- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర సాయుధ బలగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దిశ, వెబ్ డెస్క్: బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్ష (సీఏపీఎస్ఎఫ్) ద్వారా మొత్తం 209 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుషులతో పాటు మహిళలు కూడా అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 7 వరకు అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని సూచించింది.
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2020, ఆగస్టు 01 నాటికి 20-25 ఏళ్ళ మధ్య వయస్సు కలవారై ఉండాలి
మొత్తం పోస్టులు: 209
ఇందులో బీఎస్ఎఫ్-78, సీఐఎస్ఎఫ్- 69, ఐటీబీపీ- 27, ఎస్ఎస్‌బీ- 22, సీఆర్‌పీఎఫ్-13 పోస్టుల చొప్పున ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష లేదా మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 7
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఏపీలో విశాఖపట్నం, తిరుపతి
పరీక్ష తేదీ: డిసెంబర్ 20
వెబ్‌సైట్: www.upsc.gov.in