- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూనిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: పల్లె రవికుమార్ గౌడ్
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం భూనిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు తక్షణమే ఇవ్వాలని టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడు డిమాండ్ చేశారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు సహాయం పునరావాసం తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. దేవుని మాన్య భూములో ఉన్న 50 ఎకరాలు భూములు న్యాయమైన డిమాండ్‌గా ఇవ్వాలాని, దానితో పాటు 150 కోట్ల రూపాయలు ప్యాకేజీని వెంటనే రైతులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమినే కాదు, సర్వం కోల్పోయిన నర్సిరెడ్డి గూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకీ పల్లి తండా గ్రామాల ప్రజలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా మోసపూరిత చర్యలకు పాల్పడితే తెలంగాణ సమాజంతో పాటు సంఘాలను, రాజకీయ పార్టీలను ఏకం చేసి భూ నిర్వాసితులకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.