- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
25 మందితో లేచిపోయిన భార్య.. వాళ్లతో బోర్ కొట్టగానే మళ్లీ భర్త దగ్గర..
దిశ,వెబ్‌డెస్క్: భారత వైవాహిక వ్యవస్థ ఎంతో పటిష్టమైనది. ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారంటే కష్టమైనా, సుఖమైనా కలిసే అనుభవిస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వారితోనే జీవితం అనుకుంటారు. కానీ, ప్రస్తుతం వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి స్త్రీ/పురుషుల మోజులో కుటుంబాలను, బంధాలను తెంచుకొని వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. ఈ కారణంగా నూరేళ్లు సాగాల్సిన కాపురాలు కాస్త మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. కానీ, ఒక భర్త మాత్రం ఆమె భార్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సార్లు 25 మందితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఇంట్లోంచి పారిపోయి తిరిగి వచ్చినా ఒక్క మాట అనకుండా కాపురం చేస్తున్నాడు. అవునా.. ఎవరా భర్త..? ఎక్కడ ఉంటాడు అనేగా తెలుసుకుందాం రండి..
అసోం రాష్ట్రం నాగోన్ జిల్లా ధింగ్ లాహ్‌కర్ గ్రామానికి ఓ 40 ఏండ్ల మహిళకు పదేండ్ల క్రితం వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మఫీజుద్దీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన మొదటిరోజు నుంచి ఆ మహిళ, భర్తతో సరిగా కాపురం చేసిందే లేదు. ఎప్పుడు పరాయి పురుషుల గురించి ఆలోచిస్తూ వారితో పరిచయాలు పెంచుకొని పారిపోయేది. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు పదేళ్లలో 25 మంది వ్యక్తులతో 25 సార్లు వెళ్లిపోయింది. వారితో ఉన్నన్ని రోజులు ఉండి తరువాత అత్తవారింటికి వచ్చేసేది. భార్య వేరొక వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం వస్తేనే చంపేసే భర్తలున్న ఈ కాలంలో.. భార్య 25 సార్లు అలా వేరొకరితో వెళ్ళిపోయి తిరిగి వచ్చినా మఫీజుద్దీన్ మాత్రం పల్లెత్తి మాట కూడా అనలేదు. అతనే కాదు అతని కుటుంబ సభ్యులు సైతం నోరుమెదపలేదు.
భార్య అన్నిసార్లు లేచిపోయి వచ్చినా ఎందుకు కలిసి కాపురం చేస్తున్నావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే. “నాకు ముగ్గురు పిల్లలు.. నేను డ్రైవర్ ని.. ఎప్పుడు బయటకు వెళ్లి ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు. మరి పిల్లల పరిస్థితి ఏంటి..? వారిని ఎవరు చూసుకొంటారు..? అందుకే నా భార్యతో కాపురం చేస్తున్నాను. పసి పిల్లలను వదిలేసి రేయిపగలు తేడా లేకుండా చేసే డ్రైవర్ విధులు ఎలా నిర్వర్తించగలనని” తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా తన భార్య మేకల కాపరితో వెళ్లిపోయిందని, తాను ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పుకొచ్చాడు. వెళ్లే ప్రతిసారి ఇంట్లో ఉన్న డబ్బును కూడా తీసుకెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈయన స్టోరీ విన్న ప్రతి ఒక్కరు ఎంతటి ఉత్తమ భర్తవయ్యా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.