ప్రభుత్వ మదర్సాల రద్దు

by Shamantha N |
ప్రభుత్వ మదర్సాల రద్దు
X

గువాహటి: ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మదర్సాలను రద్దు చేసే బిల్లును సోమవారం అసోం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్యనే రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రవేశ పెట్టారు. ఇప్పటికే అమలులో ఉన్న ‘ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ (ప్రాంతీయీకరణ) చట్టం-1995’, ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం(ఉద్యోగుల సేవల ప్రాంతీయీకరణ, మదర్సా విద్యాలయాల పునర్వ్యవస్థీకరణ)-2018ల రద్దును ఈ బిల్లు ప్రతిపాదించింది.

రాష్ట్రంలోని అన్ని మదర్సాలను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని, చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, బోధన, బోధనేతర సిబ్బంది సర్వీసు రూల్స్, అవెన్సులు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి హేమంత బిశ్వ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో తెలిపారు. అన్ని మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చే బిల్లును ప్రవేశ పెడుతున్నామని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మదర్సాలను స్థాపించబోదని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో లౌకీకత్వాన్ని తీసుకువచ్చే బిల్లును ప్రవేశపెడుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ప్రైవేట్ మదర్సాలను రద్దు చేయడం లేదని, నియంత్రించదని స్పష్టం చేశారు. బిల్లును కాంగ్రెస్, అల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పాస్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని, పాస్ చేసి తీరుతామని మంత్రి హేమంత బిశ్వ శర్మ తెలిపారు. కొత్త బిల్లు అమలులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 610 ప్రభుత్వ మదర్సాలు రద్దవుతాయి.

Advertisement

Next Story

Most Viewed