కరోనా ఎఫెక్ట్.. ఆసియా కప్ రద్దు

by Shyam |
Asia cup
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ టీ20 టోర్నీ పూర్తిగా రద్దయ్యింది. గత ఏడాది జరగాల్సిన ఆసియా కప్ 2020ని ఏడాది పాటు వాయిదా వేశారు. అయితే శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం సాధ్య కాదని శ్రీలంక క్రికెట్ సీఈవో యాష్లే డిసిల్వ ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని పలు సభ్య దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉన్నాయని.. దీంతో పాటు వరుసగా ఐసీసీ టోర్నీలు కూడా ఉండటంతో ఆసియా కప్ కోసం సమయం దొరకడం లేదు. అందుకే ఈ టోర్నీని 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నిర్వహించాలని డిసిల్వ సూచించారు. అయితే ఆసియా కప్ రద్దు విషయంపై ఏసీసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏసీసీ అధ్యక్షుడు జై షా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉన్నది. ఆసియా కప్‌ను వాస్తవానికి 2020లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఇండో-పాక్ రాజకీయ వైరం కారణంగా వేదికను శ్రీలంకకు మార్చారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని వాయిదా వేశారు. ఇప్పుడు మొత్తానికే రద్దు చేయమని శ్రీలంక బోర్డు కోరడం గమనార్హం.

Advertisement

Next Story