Ind Vs SA : మరో రికార్డుపై కన్నేసిన అశ్విన్.. ఆరు నెలలు రిసేర్చ్ చేశానని కామెంట్స్

by Anukaran |
Ind Vs SA : మరో రికార్డుపై కన్నేసిన అశ్విన్.. ఆరు నెలలు రిసేర్చ్ చేశానని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పలు రికార్డులను బద్దలు కొట్టిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో పోరుకు రెడీ అయ్యాడు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టెస్టు‌ సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ భారత మాజీ ఆల్‌ రౌండర్ కపిల్ దేవ్‌ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అశ్విన్ 427 వికెట్లు సాధించాడు. కపిల్ దేవ్ 434 వికెట్లతో అతడికన్నా ముందు వరుసలో ఉన్నాడు. దీంతో అశ్విన్ ఈ టెస్టు సిరీస్‌లో మరో 8 వికెట్లు సాధిస్తే టెస్టుల్లో అశ్విన్ ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌పై రవిచంద్రన్ ఫుల్ ఫోకస్ పెట్టాడు.

మరోవైపు.. అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఈ గెలుపునకు సంబంధించి అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆసీస్‌ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్‌ చేశానని పేర్కొన్నాడు. అలాగే, మార్నస్ లబూషేన్‌ను ఔట్ చేసేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు రచించినట్టు తెలిపాడు. ఫీల్డ్‌లో వాటిని అమలు చేసి ఫలితం రాబట్టానంటూ కామెంట్స్ చేశాడు.

Advertisement

Next Story