Cricket News : అరుదైన రికార్డ్ రేసులో స్పిన్నర్ అశ్విన్.. ఆ నలుగురిలో విన్నర్ ఎవరు..?

by Anukaran |
Cricket News : అరుదైన రికార్డ్ రేసులో స్పిన్నర్ అశ్విన్.. ఆ నలుగురిలో విన్నర్ ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2021 అవార్డు కోసం వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ నుంచి నలుగురు క్రికెటర్లు నామినేట్‌ అయ్యారు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్ కైల్ జేమీసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్‌ కరుణరత్నె నామినేట్‌ అయినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రికార్డులు ఇవే..

1. రవిచంద్రన్ అశ్విన్..
ఈ ఏడాదిలో ఎనిమిది మ్యాచుల్లోనే 52 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు అశ్విన్. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది.

2. జో రూట్..
ఈ ఏడాదిలో ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్‌ 15 మ్యాచుల్లో 1,708 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉన్నాయి.

3. కైల్ జేమీసన్..
కివీస్‌ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ ఈ ఏడాదిలో అద్భుత ప్రదర్శనే ఇచ్చాడు. ఐదు మ్యాచుల్లో 17.51 యావరేజ్‌తో 27 వికెట్లు తీశాడు.

4. దిముత్‌ కరుణరత్నె..
శ్రీలంక సారథి దిముత్‌ కరుణరత్నె ఈ ఏడాది ఏడు టెస్టుల్లో నాలుగు సెంచరీల సాయంతో 902 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ మీద ద్విశతకం కూడా సాధించాడు.

https://twitter.com/ICC/status/1475791732667129857?s=20

Advertisement

Next Story

Most Viewed