- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉత్పత్తిని తగ్గించిన అశోక్ లేలాండ్
దిశ, వెబ్‌డెస్క్: హిందుజా గ్రూపుకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ సోమవారం తన తయారీ ప్లాంట్‌లలో ఉత్పత్తిని తగ్గించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్‌తో పాటు డిమాండ్ తగ్గిపోవడమే దీనికి కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సంస్థ డిమాండ్ పరిస్థితులను అధ్యయనం చేసిందని, అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. సరఫరాలో ఉన్న అంతరాయాలను అధిగమిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ‘కంపెనీ మోడళ్లు తాత్కాలికంగా డిమాండ్ పరిస్థితులకు ప్రభావితమవుతాయి. దేశంలోని నాలుగు ప్లాంట్‌లలో కార్యకలాపాలను తగ్గిస్తామని, మే నెలలో 7-15 రోజులు మాత్రమే పనిచేయనున్నట్టు’ కంపెనీ వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని తెలిపింది. సంస్థ తయారు చేసే రక్షణ వాహనాల ఉత్పత్తిని కొనసాగించనున్నట్టు స్పష్టం చేసింది. అలాగే, నిత్యావసర వస్తువులు, సేల కోసం అవసరమైన కమర్షియల్ వాహనాల పోర్ట్‌ఫోలియో, విడిభాగాల తయారీ కొనసాగుతుందని పేర్కొంది.