- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మార్పులు చేసినందుకే విఫలమయ్యారు’
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరచూ ఆటగాళ్లను మార్చడం వల్లే విఫలమవుతున్నదని ఆ జట్టు మాజీ బౌలింగ్ కోచ్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. వేలం వచ్చిన ప్రతీసారి ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలేయడం.. కొత్త ఆటగాళ్లను తీసుకోవడం జట్టుకు మంచి చేయడం లేదని నెహ్రా అన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్ వంటి ఆటగాళ్లను సుదీర్ఘంగా ఆడిస్తున్నారు. అలాగే ఇతర క్రికెటర్లకు కూడా ఎక్కువ సీజన్లు ఆడే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నాడు. ఒక ఆటగాడు కనీసం రెండు మూడేళ్లు జట్టులో ఉంటే.. సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పాడు. ఇతర ఫ్రాంచైజీలను పరిశీలిస్తే.. చాలా మంది ఆటగాళ్లను వరుసగా ఆడించడం వల్లే విజయాలు సాధిస్తున్నాయని నెహ్రా గుర్తు చేశాడు.
Next Story