పాక్‌పై సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ చాలా లక్కీ

by Shiva |
పాక్‌పై సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ చాలా లక్కీ
X

దిశ, స్పోర్ట్స్: ఆటలో టాలెంట్ ఉంటేనే సరిపోదు ఒక్కోసారి అదృష్టం కూడా తోడవ్వాలి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌(Legendary cricketer Sachin Tendulkar)కు ఇలాంటి అదృష్టమే ఒకే మ్యాచ్‌లో నాలుగు సార్లు వరించింది. అది ఏకంగా భారత జట్టు వరల్డ్ కప్(World Cup) గెలుచుకునేందుకు దోహదపడటం(Contributing) గమనార్హం. సచిన్‌కు ఆ లక్కీ ఇన్నింగ్స్ 2011 వరల్డ్ కప్ సెమీస్‌(2011 World Cup Semis)లో పాకిస్తాన్ జట్టు(Pakistan team)పై వచ్చింది.

దాని విశేషాలను ఆనాటి మ్యాచ్ ఆడిన పేసర్ ఆశిష్ నెహ్రా(Pacer Ashish Nehra) తాజాగా గ్రేటెస్ట్ రైవల్రీ పాడ్‌కాస్ట్(Greatest Rivalry Podcast) అనే కార్యక్రమంలో గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ రోజు సచిన్ టెండుల్కర్ 115 బంతుల్లో 85(85 off 115 balls) బాధ్యతాయుతంగా ఆడి భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్(Score) చేసేందుకు దోహదపడ్డాడు. అయితే, ఇన్నింగ్స్‌(Innings)లో నాలుగు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి సచిన్ బతికిపోయాడు.

27, 45, 70, 81 పరుగుల(Runs) వద్ద సచిన్ అవుటయ్యే అవకాశాలు వచ్చినా పాక్ ఆటగాళ్లు(Pak players) చేసిన తప్పులకు బతికిపోయాడు. చివరకు 85 పరుగులు చేసి అజ్మల్(Ajmal) బౌలింగ్‌లో అఫ్రిది(Afridi)కి క్యాచ్(Catch) ఇచ్చి పెవీలియన్(Pavilion) చేరాడు. ‘సచిన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటి. ఆ రోజు సచిన్ చాలా అదృష్టవంతుడు’ అని నెహ్రా కొనియాడాడు. అయితే ప్రపంచ కప్(World Cup) వంటి టోర్నీలో ఒత్తడి ఉండటం సహజమని, అందుకే పాక్ ఆటగాళ్లు తప్పులు చేసి ఉండొచ్చని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 260/9 స్కోర్ చేయగా, పాక్ జట్టు 231కే ఆలౌట్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed