- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడు సోనూసూద్ పేరిట ఘరానా మోసం..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచిన విషయం తెలిసిందే. వలస కార్మికులను ఉచితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం పేద విద్యార్థులకు ఉచితంగా సెల్‌ఫోన్స్ కూడా అందజేశారు. అంతేకాకుండా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని తనకు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికీ తనవంతు సాయం అందించాడు. అయితే, సోనూసూద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
ఆయన పేరుతో ఫేక్ సోషల్ మీడియా ఖాతా తెరిచి ప్రజల నుంచి భారీగా డబ్బులు కాజేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్ కుమార్ అనే యువకుడు సోను పేరిట ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆపదలో ఉన్నాం.. సాయం చేయాలని అతనికి చాలా మంది నుండి రిక్వెస్టులు వచ్చాయి. సాయం చేస్తానంటూ బాధితుల నుంచి ఆశిష్ కుమార్ భారీగా డబ్బులు వసూలు చేశాడు. సాయం అందక పోగా, ఉన్న డబ్బులు పోగొట్టుకున్నామని తెలుసుకున్న బాధితులు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు ఆశిష్‌ను సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.