- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో బ్రాండ్ ని సొంతం చేసుకున్న వీ-మార్ట్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అరవైంద్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు చెందిన అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ అన్నిటినీ వీ-మార్ట్‌కు విక్రయించినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. వీ-మార్ట్ రిటైల్‌కు అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ విక్రయం పూర్తిగా నగదు లావాదేవీ రూపంలో జరిగినట్టు కంపెనీ పేర్కొంది. దీనిపై స్పందించిన వీ-మార్ట్ రిటైల్ లింటెడ్ ఎండీ లలిత్ అగర్వాల్.. భారత్‌లో బలమైన రిటైల్ సంస్థగా వీ-మార్ట్ కొనసాగుతోంది.
ఫ్యాషన్ విభాగంలో ప్రజలకు అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ముఖ్యంగా తాము దేశీయంగా ఉన్న టైర్2, టైర్3 నగరాల్లో అధికంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో అరవింద్ లైఫ్‌స్టైల్స్ బ్రాండ్స్ అన్నిటినీ వీ-మార్ట్ కిందకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అరవింద్ లైఫ్‌స్టైల్ దేశవ్యాప్తంగా 74 ఫ్యాషన్ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోందని, వీ-మార్ట్‌తో ఒప్పందంలో భాగంగా ఈ స్టోర్లతో పాటు, వేర్ హౌస్, ఇన్వెంటరీ, అన్‌లిమిటెడ్ బ్రాండ్లు వీ-మార్ట్ సొంతమవుతాయని కంపెనీ వెల్లడించింది.