- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీని మెచ్చుకున్న అరుణ
దిశ, సిద్దిపేట: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న అబివృద్ది, సంక్షేమ, పథకాల అమలు తీరు అద్భుతంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో తాను బీజేపీలో చేరనని గాడిపల్లి అరుణ-భాస్కర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుండనటానికి ప్రజలు పూర్తీ మెజార్టీతో రెండవసారి అధికారం కట్టబెట్టారని ఆమె గుర్తు చేశారు.
రావణకాష్టంల మండే జమ్మూకాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆమె అన్నారు. ముస్లిం మహిళలకు గుదిబండల ఉన్న త్రీబుల్ తలాక్ రద్దు చేసి వారికి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. దేశ రక్షణ కోసం అబివృద్ది కోసం అనేక సంస్కరణలు చేస్తున్నారని ఆమె తెలిపారు. సర్జికల్ స్ర్కైక్, ఆర్టికల్ 370 రద్దు వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని ఆమె కొనియాడారు. సిద్దిపేట మున్సిపాలిటీ లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అరుణ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం తమవంతు కృషి చేస్తానని అరుణ రెడ్డి తెలిపారు.