- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్ పర్యటన సందర్భంగా అరెస్ట్ లు
దిశ, గద్వాల: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2012లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల ప్లాట్లను రద్దు చేయకుండా ప్లాట్లు తమకే ఇవ్వాలని, ఆ స్థలంలో కాకుండా నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రులను వేరేచోట నిర్మించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివాదాస్పద స్థలంలో బుధవారం మంత్రి హరీష్ రావు చేతులమీదుగా నర్సింగ్ కళాశాల, జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరగాల్సి ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పర్యటన సమయానికి కొంత సమయం ముందుగానే రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. పేదల డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇలా అక్రమ అరెస్టులు చేయడం సమంజసం కాదని పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.