12 దేశాల నుంచి 64 విమానాల్లో భారతీయుల తరలింపునకు ప్లాన్…

by Shamantha N |
12 దేశాల నుంచి 64 విమానాల్లో భారతీయుల తరలింపునకు ప్లాన్…
X

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశం తీసుకు వచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఏడు, బ్రిటన్ నుంచి కూడా ఏడు విమానాల ద్వారా ఇండియన్స్ ని తరలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రయాణ ఖర్చులను కేంద్రం వెల్లడించింది. ప్రయాణికులు ఎవరి ఖర్చులు వారే భరించాల్సిoదిగా కేంద్రo స్పష్టం చేసింది. యూఏఈకు 10 విమానాలు అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్‌కు ఐదు, ఖతార్‌ నుంచి రెండు చొప్పున విమానాలు నడపనుందని సదరు అధికారి వెల్లడించారు. వీటితోపాటు మలేషియా, బంగ్లాదేశ్‌లకు చెరో ఏడు, కువైట్‌, ఫిలిప్పీన్స్‌కు చెరో ఐదు చొప్పున, ఒమన్‌, బెహ్రెయిన్‌కు చెరో రెండు చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది. మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, ఢిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11; మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో ఏడు, మిగతా రాష్ట్రాల నుంచి ఐదు చొప్పున విమానాలు నడుస్తాయని ఆయన వివరించారు. ఈ ఏడు రోజుల కాలంలో 14,800 మంది భారతీయులు చేరుకుంటారనీ.. మిగతా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలను నడుపుతుందని మరో అధికారి తెలిపారు.

ఎవరి చార్జీలు వారివే :

బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. యుఎస్ అయితే ఈ చార్జీని రూ. లక్షగా నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ. 12 వేలు పే చేయవలసి ఉంటుంది. ఎక్కువ విమానాలను కేరళ నుంచి పంపనున్నారు. ఢిల్లీ-తమిళనాడు నుంచి 11 చొప్పున, మహారాష్ట్ర-తెలంగాణ నుంచి 7 చొప్పున, గుజరాత్ నుంచి ఐదు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక నుంచి మూడు చొప్పున, పంజాబ్-యూపీ నుంచి ఒక్కొక్కటి చొప్పున విమానాలు ఎగరనున్నాయి. తొమ్మిది దేశాల నుంచి వచ్చే పదకొండు విమానాలు తమిళనాడు చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. రోజూ దాదాపు రెండు వేల మంది భారతీయులను తరలించే అవకాశం ఉందన్నారు. భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్‌ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని, ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఏయే దేశాల నుంచి :

యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బెహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్

Tags: indian national, air services, air india, flights

Advertisement

Next Story

Most Viewed