సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి – కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా 

by Shyam |
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి – కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా 
X

దిశ,వనపర్తి: వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 17 -20 తేదీల మధ్య ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని తెలిపారు. నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం, మార్కెట్ యార్డ్ కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి బస్సు మార్గాన వస్తున్న సందర్భంగా అంతరాయం కలుగకుండా ఆర్అండ్‌బీ శాఖ తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కర్నే తాండ దగ్గర హెలిప్యాడ్ కు సిద్ధం చేయాలని, ఆర్అండ్‌బీ శాఖ, ఇరిగేషన్ శాఖను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమానికి డీఆర్‌డీఓ, డీఎల్‌పీఓ శాఖలు నిర్వహణ పనులు ఏర్పాటు చేయాలన్నారు. వీరాయ పల్లి పరిశోధన ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని, చిట్యాలలో మార్కెట్ యార్డ్ వేరుశనగ రైతులను తరలించేలా చూడాలని, ఏఎంసీ మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు హాజరయ్యే విధంగా వారికి సమాచారం అందించి ప్రోటోకాల్ పాటించాలన్నారు. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం సోమవారం రాత్రి చిట్యాలలోని డబల్ బెడ్ రూమ్ లను, మార్కెట్ యార్డును, సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ కార్యాలయానికి అందమైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. కార్యాలయ ఆవరణలో సింగపూర్ చైర్, గన్నేరు తదితర చెట్లను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారికి ఆదేశించారు.

ముఖ్యమంత్రి నూతన కలెక్టర్ కార్యాలయంలో పూజ నిర్వహిస్తున్న సందర్భంగా అందుకు సంబంధించిన పూజ సామాగ్రి, పురోహితుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్ డీఎంహెచ్ఓ చందు నాయక్, ఆర్అండ్‌బీ ఈఈ దేశ్యనాయక్, పి ఆర్ ఈఈ మల్లయ్య, హార్టికల్చర్ అధికారి సురేష్, తహశీల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed