- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలర్ట్.. తెలంగాణలో మళ్లీ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా ప్రభావంతో మే నెలలో వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలు తగిన ఏర్పాట్లను చేపట్టాయి. జెఎన్‌టీయూ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలను జులై 5 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఉస్మానియా పరిధిలో జులై 19 ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ పరీక్షలను నిర్వహించనున్నారు. జులై 14, 15 తేదీల్లో వాయిదా పడిన పీజి 3వ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొత్తగా విద్యార్థులు ఎంచుకున్న పరీక్షా సెంటర్లలోనే పరీక్షలు రాసేందుకు అన్ని యూనివర్సిటీలు అనుమతులిచ్చాయి. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కవ దూరం ప్రయాణం చేసే అవసరం లేకుండా అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలకు హాజరై పరీక్షలు రాసే వెసులుబాటును కల్పించారు. వీటితో పాటు 2.30 గంటలు నిర్వహించాల్సిన పరీక్షల సమయాన్ని 3గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రశ్నా పత్రాల్లో ఆప్షన్లను కూడా పెంచినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా సెంటర్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టారు, కాల్సిన శానిటైజర్లను, మాస్క్ లను విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే సమయంలో అన్ని తరగతుల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ఉండేందుకు ఉదయం, మధ్యాహ్నం రెండు సమయాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఈ నెల చివరి నాటిని డిగ్రీ ఫైనల్ ఇయర్, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు. జెఎన్‌టీయూ పరిధిలో బీటెక్, బీ ఫార్మసీ తరగతులను సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.