- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మావోయిస్టుగా మారిన ఆర్మీజవాన్
దిశ,వెబ్ డెస్క్ :మావోయిస్టు కమాండర్‌నంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ ఆర్మీజవాన్. గతంలో తాను భూలావాదేవీల వ్యవహారంలో నష్టపోయిన డబ్బులు తిరిగి సంపాదించుకోవాలన్న ఉద్దేశ్యంతో మావోయిస్టు గామారాడు. వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తర ప్రదేశ్ లో ఆర్మీజవాన్ గా పనిచేస్తాడు. ఇటీవల 45 రోజుల సెలవుపై గ్రామానికి వచ్చాడు. అయితే తాను గతంలో సుమారు రూ.22 లక్షలు నష్టపోయాడు. ఈ సారి ఎలాగైన ఆ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఇంటికి వచ్చేముందే రూ. 30 వేలకు తుపాకీ కొని ఇంటికి తీసుకచ్చాడు.
ఈ నేపథ్యంలో తాను ఓ బంగారం వ్యాపారి ఇంటికి వెళ్లి రూ. 5 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అయితే అతను నేను అంత ఇవ్వలేను కోటిన్నర రూపాయలు మాత్రమే ఇవ్వగలను చెప్పాడు. దీంతో సరే నువ్వు డబ్బులు తీసుకొని నేను చెప్పిన చోటుకిరా అని చెప్పాడు. సరేనన్న బంగారం వ్యాపారి పోలీసులకు సమాచారం అందిస్తాడు. పోలీసులు బంగారం వ్యాపారికి నకిలీ నోట్లు ఇచ్చి ఆర్మీ జవాన్ రమ్మన్న చోటికి పంపిస్తారు. దీంతో అక్కడికి ఆర్మీ జవాన్ రాగానే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని పై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.