- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచిన్ కొడుకు ఆట తీరు చూస్తారా? మరో ఆటో డ్రైవర్ కొడుకును బలి చేస్తారా?
దిశ,వెబ్‌డెస్క్:క్రికెట్ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు. వికెట్లను గాల్లోకి ఎగరేసే యార్కర్లు. పాదరసంలా కదిలే ఫీలర్డర్లు. ఒకటా రెండా ఎన్నోఎన్నెన్నో. దాదాపూ నెలన్నర రోజుల పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది.
ఈనెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 1097మంది ఆటగాళ్లు తమపేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఇంగ్లాడ్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిట్చెల్ స్టార్క్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, ఇండియా వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ ఆక్షన్ లో తమపేర్లను నమోదు చేసుకున్న వారిలో 814మంది భారత్కు చెందిన ఆటగాళ్లు ఉండగా 283మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో వెస్టిండీస్ నుంచి 56మంది, ఆస్ట్రేలియా నుంచి 42మంది, సౌతాఫ్రికా నుంచి 38మంది ఉన్నారు.
ఈఎస్పీఎన్సీ క్రికెట్ ఇన్ఫో వివరాల ప్రకారం.. షకీబ్ అల్ హసన్ కనీస ధర రూ.2కోట్లు, ఏడేళ్ల తర్వాత సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరుపున ఆడిన శ్రీశాంత్ రూ.75లక్షలు, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, జాసన్ రాయ్, మార్క్ వుడ్, లియామ్ ప్లంకెట్, కోలిన్ తమ కనీస ప్రారంభ మద్దతు ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఆస్ట్రేలియాపై భారతదేశం 2-1 తేడాతో టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన విహారీ రూ.1కోటి, పుజారా రూ .50 లక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కనీస ప్రారంభ ధర రూ.21లక్షలకు నమోదు చేసుకున్నారు. అయితే మిగిలిన అందరి క్రికెటర్ల కంటే అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ వేలంలో ఎంత ధర పలుకుతారనే క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సచిన్ కుమారుడని ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారా లేదంటే టాలెంట్ ను బేస్ చేసుకొని కొనుగోలు చేస్తారా అని’ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ ఆటో డ్రైవర్ కొడుకు
ఎందుకంటే 2016లో ముంబై క్రికెట్ అసోసియేషన్ హెచ్.టి. భండారి కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఆ టోర్నమెంట్ టెస్ట్ మ్యాచ్ లో ముంబై టీం తరుపున ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ ప్రశాంత్ దనవాడే కుమారుడు 16ఏళ్ల ప్రణవ్ దనవాడే ఇంగ్లాడ్ బ్యాట్స్‌మెన్ ఆర్థర్ కాలిన్స్ స్కోర్ 628 ను క్రాస్ చేసి రికార్డ్ సృష్టించాడు. ప్రణవ్ 323బంతుల్లో 129ఫోర్లు, 59సిక్సర్లతో 1009 నాటౌట్‌గా నిలిచి రికార్డ్ సృష్టించాడు. దీంతో ప్రణవ్ కు ఇండియన్ క్రికెటర్లు సచిన్, హర్భజన్, మహేంద్ర సింగ్ ధోనీలు అభినందనలు తెలిపారు. ఇంగ్లాడ్ బ్యాట్స్‌మెన్ ఆర్థర్ కాలిన్స్ స్కోర్ ను క్రాస్ చేయడంపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఆటో డ్రైవర్ కొడుకు అద్భుత ఆటతీరుకు మంత్ర ముగ్ధుడైన నాటి మహరాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వినోద్ తవాడే మాట్లాడుతూ ప్రణవ్ కు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సంబంధిత ఖర్చులన్నీ రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.
అండర్ -16 సెలక్షన్‌లో విధి ఆడిన వింతనాటకం
కాని అదే ఏడాది జూన్‌లో జరిగిన వెస్ట్‌జోన్ అండర్ -16 సెలక్షన్‌లో ప్రణవ్‌తో విధి వింతనాటకం ఆడింది. వెస్ట్‌జోన్ అండర్-16లో ఆడేందుకు తగిన వయస్సు లేదని సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రణవ్‌ను పక్కన పెట్టారు. అదే వయస్సున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ను సెలక్షన్ కమిటీ సభ్యులు వెస్ట్ జోన్ అండర్ -16 తరుపున ఎంపిక చేశారు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రికార్డ్‌లు సృష్టించిన ఆటో డ్రైవర్ కొడుకు ప్రణవ్ను పక్కన పెట్టారని, మెరుగైన ఆటతీరు లేకపోయిన సచిన్ టెండుల్కర్ కుమారుడేనన్న కారణంగా ఎంపిక చేశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిభకు పట్టం కట్టేనా, లేదంటే ఆటో డ్రైవర్ కొడుకులా బలిచేస్తారా?
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో తొలిసారి పాల్గొంటున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ చర్చాంశనీయంగా మారారు. అభిమానులపై వినోదాల విందును కురిపిస్తూ ఆటగాళ్లపై కాసుల వర్షం ఐపీఎల్ మ్యాచ్ లో ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల.గతంలో ఐపీఎల్‌లో ఆడిన ఎంతో మంది క్రికెటర్లకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చింది. ఆ అవకాశం కోసమే క్రికెటర్లు ఐపీఎల్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే త్వరలో జరిగే ఐపీఎల్ వేలంలో ప్రతిభకు పట్టంకడతారా లేదంటే క్రికెట్ పాలిటిక్స్ ?తో ప్రణవ్‌కు జరిగినట్లే ఐపీఎల్‌లో మరో క్రికెటర్ బలవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.