మెస్సీ.. మాంచెస్టర్ వెళ్లు

by Shiva |
మెస్సీ.. మాంచెస్టర్ వెళ్లు
X

దిశ, స్పోర్ట్స్ : బార్సిలోనా క్లబ్‌తో ఉన్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని లియోనెల్ మెస్సీ తెంచుకోబోతున్నాడనే వార్త సాకర్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. బార్సిలోనా అభిమానులైతే మెస్సీ వీడిపోతున్నాడనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే మెస్సీ సొంత దేశమైన అర్జెంటీనాలోని సాకర్ ఫ్యాన్స్ మాత్రం అతడిని మాంచెస్టర్ సిటీ క్లబ్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు.

మెస్సీ కూడా బార్సిలోనా జట్టుతో తన ప్రయాణం ముగిసిపోయినట్లే అని భావిస్తున్నాడని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తాడని సన్నిహితులు చెబుతున్నారు. మాంచెస్టర్ సిటీ క్లబ్ మేనేజర్ గార్డియాలోతో మెస్సీ మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు అర్జెంటీనా దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది. అర్జెంటీనా సాకర్ అభిమానులు కూడా మెస్సీని మాంచెస్టర్ క్లబ్‌లో చూడాలని కోరుకుంటున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నది. మెస్సీ బార్సిలోనా వీడితే మాత్రం న్యాయపరంగా పోరాడతామని బార్సిలోనా క్లబ్ లాయర్ హెచ్చరిస్తున్నారు. మెస్సీ పేర్కొంటున్న క్లాజ్ జూన్ లోనే రద్దయ్యిందని అంటున్నాడు.

Advertisement

Next Story