ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయా?

by srinivas |
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయా?
X

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి కరోనా కేసులు నమోదు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు కరోనా స్తబ్దుగా ఉంది. నిన్న సాయత్రం సీఎంవో అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ, ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఏపీలో కరోనా కేసులు కొలిక్కి వచ్చాయని, కేవలం 13 కేసులతోనే కరోనాను తుదముట్టించారని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను తప్పని నిరూపిస్తూ సాయంత్రానికి ఆరు కేసులు నమోదై షాకిచ్చాయి.

నిన్న ఒక్క రోజే ఆరు కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి మత పరమైన కార్యక్రమం కోసం వెళ్లిన గుంటూరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అతని నుంచే తాజాగా కరోనా దంపతులకు సోకినట్టు తేలింది. ఎందుకంటే ఆ వ్యక్తితో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

వీరిద్దర్నీ ఈ నెల 26 నుంచే ఆసుపత్రిలో ఉంచారు. అయితే క్వారంటైన్‌లో ఉన్న వీరి నమూనాలు పరీక్షించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరెవరిని కలిశారు, వారెవర్నికలిశారు అన్న ఆరాతీస్తున్నారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండేసి, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
నిన్న 74 మందికి చెందిన నమూనాలను కరోనా పరీక్ష కోసం పంపించగా 68 మందికి కరోనా వైరస్‌ లేదని తేలినట్టు తెలుస్తోంది. మిగిలిన ఆరు పాజిటివ్‌గా వచ్చాయి. మరోవైపు హోం క్వారంటైన్‌లో 29,242 మంది ఉండగా, 179 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య తెలిపింది. ఏపీలో తొలి కరోనా బాధితుడైన నెల్లూరు వాసితో పాటు రెండో పాజిటివ్ కేసైన వైజాగ్ వాసి కూడా కోలుకున్నారు.

Tags: corona virus, covid-19, ap, visakhapatanam,

Advertisement

Next Story

Most Viewed