- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆహా’లో అర్ధ శతాబ్దం..
దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’.. మరో ఎక్స్‌క్లూజివ్ మూవీతో ముందుకు రాబోతుంది. రవీందర్ పుల్లె దర్శకత్వంలో వస్తున్న ‘అర్ధ శతాబ్దం’ సినిమా జూన్ 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా.. కంటెంట్‌పై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. కాగా సోమవారం జూమ్ మీటింగ్‌లో చిత్ర విశేషాలను వెల్లడించిన దర్శకుడు.. సమాజంలోని అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రాసుకున్నట్టు తెలిపాడు. సినిమాలోని ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముందని చెప్పారు.
సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రస్థానంలో తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌కు చాలా డెప్త్ ఉంటుందని, మళ్లీ అంత డెప్త్ ఈ సినిమాలోని డైలాగ్స్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. ఆలోచన, ఆవేశాన్ని కలిగించే సినిమా అని పేర్కొన్నారు. శుభలేక సుధాకర్ మాట్లాడుతూ.. ‘సమాజంలో పరిస్థితులు, ప్రాముఖ్యతలు మారిపోవడం వల్ల మంచి చేయాలనుకున్న వ్యక్తులు కూడా సకాలంలో చేయలేకపోతున్నారు. ప్రతీ వ్యక్తి కూడా ఇది నా బాధ్యతని ఫీలై చేస్తేనే అందరికీ మంచి జరుగుతుంది.. అదే అర్ధ శతాబ్దం మూవీ’ అని అన్నారు. రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన సినిమాకు వెంకట ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ అందించాడు. కాగా నోఫెల్ రాజా మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన పాటలు మంచి టాక్ తెచ్చుకున్నాయి.