- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాంధీభవన్‌కు వాస్తు మార్పులు!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేయనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత గాంధీభవన్‌లో పలు మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న గాంధీభవన్‌కు రేవంత్ వెళ్లనున్నారు. అదేరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర పూజలు చేసి, నాంపల్లి దర్గా మీదుగా గాంధీభవన్‌కు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ముందుగా లక్ష మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా… కొవిడ్ నేపథ్యంలో పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక వాస్తు మార్పుల్లో భాగంగా గాంధీభవన్ తూర్పులో మరో ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఛాంబర్ తూర్పులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పుడు ఉన్న పీసీసీ ఛాంబర్‌ను ఖాళీ చేయనున్నారు. అదే విధంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాలు విక్రయించే గదితో పాటుగా సెక్యూరిటీ రూమ్‌ను తొలగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రేవంత్ ప్రమాణస్వీకారం నాటికి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.