- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాన్ ప్రకారమే.. స్టార్లపై ట్రోలింగ్ : సల్మాన్ బ్రదర్
దిశ, సినిమా : గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చాలామంది స్టార్లు హార్డ్ టైమ్స్ ఫేస్ చేయగా.. ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్‌కు గురికావాల్సి వచ్చింది. కాగా ఈ పరిస్థితులపై సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్.. మెర్స్‌లెస్ ట్రోలింగ్ వల్ల పలువురు సెలబ్రిటీలు ప్రొఫెషనల్‌గానే కాక మానసికంగానూ ఇబ్బందిపడ్డారని తెలిపాడు.
‘ఇక్కడ మానసికంగా స్థిరంగా ఉండటం చాలా కష్టం.. ఏదో వేవ్‌లా వచ్చిపడుతుంది, వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఉండదు. ఏడాదిన్నరగా జరిగిన విషయాలను తలచుకుంటే హాస్యాస్పదంగా ఉంది. ట్రోలింగ్ చాలా మందిని నాశనం చేసింది’ అని అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఇప్పటివరకు క్రికెట్, యాక్టింగ్ ఈ రెండు ప్రొఫెషన్స్‌లోనే స్టార్‌డమ్ ఎక్కువ. అయితే క్రికెటర్లు ప్రొటెక్టివ్‌గానే ఉన్నా.. స్టార్స్ మాత్రం ట్రోల్ చేయబడ్డారు. ఎలాగంటే.. ‘మీరు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలరని అనుకుంటున్నారేమో.. స్టార్స్ సెయింట్స్ కాదని చూపిస్తాం, మేము కూడా పరుగెత్తిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు స్టార్లపై ట్రోలింగ్ ప్లాన్ ప్రకారమే జరిగిందన్నాడు.