- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ర్యాపిడ్ కిట్‌లతో విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు
అబుదాబి: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇంత వేగంగా విశ్వవ్యాపితం కావడంలో విమానయానాల పాత్ర గణనీయం. ఈ విషయమై ప్రపంచదేశాలు ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లోనే కఠిన పరీక్షలు నిర్వహిస్తే మహమ్మారి ముప్పు ఇంతగా ఉండేది కాదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోకి ఈ వైరస్ ఎంటర్ కాకుండా చెక్ పెట్టేందుకు ఎమిరెట్స్ విమానయాన సంస్థ ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రాపిడ్ కిట్ల సహాయంతో ప్రతీ ప్రయాణికుడికి స్క్రీనింగ్ టెస్టు చేయాలని సంస్థ భావిస్తోంది. విమానాశ్రయాల్లోనే కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు నిర్వహించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇప్పటికే దుబాయ్‌లో విమానసర్వీసులు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో ఎమిరేట్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ నుంచి తమ సొంత దేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ సంస్థ విమానాలు నడిపిస్తోంది. దీంతో ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారినే ప్రయాణానికి అనుమతిస్తోంది. దుబాయ్ నుంచి టునీషియా వెళ్తున్న ప్రయాణికుల కోసం తొలి సారి రాపిడ్ కిట్ల సహాయంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ కరోనా నిర్థారణ పరీక్షా ఫలితాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఎమిరేట్స్ సంస్థ అన్ని విమానాశ్రయాల్లో ఈ పద్దతిని అమలు చేయనున్నట్లు సంస్థకు చెందిన ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
tags: rapid test kits, airports, arab emirates, testing, coronavirus, containment