బుర్కా విషయంలో స్పందించిన ఏఆర్ రెహమాన్

by Shyam |
బుర్కా విషయంలో స్పందించిన ఏఆర్ రెహమాన్
X

దిశ, వెబ్‌డెస్క్ : తన కూతురు ఖతీజా రెహమాన్ బుర్కా ధరించిన విషయం గురించి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. మగాళ్లకు కూడా బుర్కా వేసుకునే అవకాశం ఉంటే తాను ధరించేవాడినని ఆయన అన్నారు. అంతేకాకుండా తన కూతురి గొప్ప మనసు గురించి ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఆమెకు బుర్కాలోనే స్వేచ్ఛ దొరికింది. పనివాళ్ల బంధువుల అంత్యక్రియలకు వెళ్లే ఆమెను సింప్లిసిటీని చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది. సోషల్‌గా కూడా ఆమె అలాగే ఉంటుంది’ అంటూ రెహమాన్ తన కూతురు ఖతీజా గురించి పొగిడారు.

తస్లీమా నస్రీన్ కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికి ముందు ఖతీజా తనను గానీ, కుటుంబ సభ్యులను కానీ అడగలేదని, ఏదైనా కరెక్టు అనిపించిందో ఆ పనే చేసిందని రెహమాన్ చెప్పారు. ఒక్కపాటతో ఎంతో మంది మదిని దోచిన ఖతీజాకు తనను తప్పుబట్టిన వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉందని, ఆమెకు మంచేదో చెడేదో తెలుసనని అన్నారు. ఖతీజా బుర్కా ధరించి పెట్టిన ఫొటోకు తస్లీమా నస్రీన్ తప్పుడు కామెంట్ చేయడం, దానికి ఖతీజా గట్టిగా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed