హాలీవుడ్‌కు సౌత్ డైరెక్టర్?

by Shyam |
హాలీవుడ్‌కు సౌత్ డైరెక్టర్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ సినిమా స్టాండర్డ్స్, లెవల్ పెరుగుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ టాలెంట్ ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రశంసలు అందుకుంటోంది. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచగా.. ఇటీవలే ఆస్కార్‌కు నామినేట్ అయిన జల్లికట్టు మూవీ మలయాళ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే ప్రతీ సినిమా కూడా డిఫరెంట్ స్టోరీతో కాంప్లిమెంట్స్ అందుకుంటుండగా.. డైరెక్టర్లు ఇంటర్నేషనల్ ఫేమ్ పొందుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ డైరెక్టర్‌‌ ఒకరు హాలీవుడ్ మూవీ డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘గజిని, స్టాలిన్, 7th సెన్స్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన మురుగదాస్.. బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌజ్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్న ఆయన.. ఈ మధ్యే కథ వినిపించగా నిర్మాణ సంస్థ ఓకే చేసినట్లు సమాచారం. యాక్షన్ యానిమేషన్ తరహాలో వచ్చే సినిమా ‘ద బ్యూటీ అండ్ బీస్ట్’ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. కాగా దీనిపై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.

చివరగా రజినీకాంత్‌ ‘దర్బార్’ సినిమా చేసిన మురుగదాస్.. తలైవా ఫ్యాన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఇళయ దళపతి విజయ్‌తో సినిమా ఉంటుందని టాక్ వచ్చినా.. అది పట్టాలెక్కే చాన్స్ లేదని అర్ధమవుతోంది. కాగా ఈ టైంలో మురుగదాస్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే చాన్స్ కొట్టేశాడని వార్తలు వస్తుండటంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Next Story