- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు పెట్టేందుకు వేలం పాట
దిశ, ఫీచర్స్ : ఐపీఎల్ నుంచి చీటి పాట వరకు ఎన్నో ఆక్షన్స్ చూసి ఉంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ అక్వేరియం మాత్రం మూడు షార్క్ చేపలకు పేరు పెట్టేందుకు వేలం పాట నిర్వహించనుంది. సీ రీసెర్చ్ ఫౌండేషన్‌లో భాగమైన మిస్టిక్ అక్వేరియం ఈ నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 19న వేలం జరగనుంది.
కెనడాలో ఉన్న బెలుగా జాతికి చెందిన మూడు తిమింగాలను(కేలా, జూనో, నటాషా – స్టేజ్ నేమ్స్) న్యూయార్క్‌లోని ‘మిస్టిక్ అక్వేరియం’నికి తీసుకురావడానికి సీ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది. అయితే వీటిని అమెరికాకు తీసుకురావడానికి అయ్యే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును సేకరించడం కోసం ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ద్వారా కనీసం 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు భావిస్తున్నారు.
వేలంలో బోటు, వింటేజ్ కారుతో పాటు, పాతకాలపు వివిధ వస్తువులు కూడా ఉన్నాయి. ఇక మిస్టిక్ అక్వేరియం ‘బెలుగా’ జాతి తిమింగాలుకు కేరాఫ్ కాగా, వీటి సంరక్షణ కోసం సంవత్సరానికి 5 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా ఆహారం, పశువైద్య సంరక్షణ, ఆవాసాలు, పరిశోధనలను నిర్వహించడానికి దాదాపు 250,000 డాలర్లు ఏటా వెచ్చిస్తున్నారు. ఒంటారియాలోని మెరైన్‌లాండ్ నుంచి తిమింగలాలు రవాణా చేయడానికి ఫౌండేషన్ గత నెలలో మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. వీటికోసం సి -130 కార్గో విమానం ప్రత్యేక విమానం కేటాయించడంతో పాటు, అందులో కస్టమ్-మేడ్ స్ట్రెచర్లు, ప్రత్యేక ట్యాంకులను అందుబాటులో ఉంచారు.
‘గతంలోనూ ఇతర జంతువులకు పేరు పెట్టాం, ప్రస్తుతం మూడు తిమింగలాను స్టేజ్ పేర్లతో పిలుస్తున్నాం. ఈ సారి వీటికి పేర్లు పెట్టే చాన్స్‌ను ప్రజలకు ఇస్తున్నాం. ఈ అవకాశం గురించి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఈ చర్య నిజంగా జంతువులను సమాజంలో భాగం చేస్తుంది. కొత్త జంతువులను స్వాగతించడంలో భాగం కావడం సంతోషకరం’ అని సీ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీఈవో స్టీఫెన్ కోన్ అన్నాడు.