రైల్వే జోనల్ కన్సల్టేటివ్ మెంబర్‌గా నాగన్న గౌడ్ నియామకం

by Shyam |
yaragani nagana goud
X

దిశ, హుజూర్‌నగర్: సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కన్సల్టేటివ్ మెంబర్‌గా నియమితులైన యరగాని నాగన్న గౌడ్‌ను టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా నాగన్న గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రైల్వే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నారు. అనంతరం నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు రైల్వే జోనల్ యూసర్స్ కన్సల్టేటివ్‌గా నియమించడం పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. గతంలో కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రజల అవసరాలను గుర్తించి రైల్వే స్టేషన్లలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.

Advertisement

Next Story