- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు, జీహెచ్ ఎంసీతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పడిన అభ్యర్థుల ఖాళీ స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ మేరకు ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వారికి కేటాయించిన విధుల్లో ఎవరికీ మినహాయింపు లేదని, అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు రిపోర్టులను ఎన్నికల కమిషన్ కు అందించాలని పేర్కొన్నారు. విధులు పూర్తి చేసుకున్న అనంతరం పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు అందించాలని సూచించారు.
ఎన్నికల పరిశీలకులు వీరే..
వరంగల్ అర్బన్ జిల్లాకు సీహెచ్ వేణుమాధవ్ రెడ్డిని, వరంగల్ రూరల్ కు దేవేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంకటేశ్వర్ రెడ్డి, సిద్దిపేటకు ఎల్ నర్యా, మహబూబ్ నగర్ కు శ్యాం సుందర్ ప్రసాద్, నాగర్ కర్నూల్ కు శ్రీనివాస్ బాబు, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎండీ రెహ్మాన్, రంగారెడ్డికి సీహెచ్ శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లికి జె శ్రవణ్ కుమార్, సంగారెడ్డికి కే బాబును ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.