- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వ్యయ పరిశీలకుడి నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలకు సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని నియమించింది. అలాగే వ్యయ పరిశీలకుడిగా ఎల్ నర్య ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తొలుత జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి శ్రీధర్ ను నియమించారు. అయితే 30న పోలింగ్, మే 3న లెక్కింపు ప్రక్రియ ఉండటంతో ఒకేసారి రెండు ప్రాంతాల్లో పర్యవేక్షించడంలో ఇబ్బందులు తెలెత్తుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడినవారికి, దివ్యాంగులకు, ఈనెల 15 తర్వాత కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్ల వివరాలను ప్రదర్శించాలని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆయన ఆదేశాలు జారీచేశారు.