రూ. 2 లక్షల కోట్లకు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమ

by Harish |
Appliances
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వచ్చే 5-6 ఏళ్లలో రెండు రెట్లు వృద్ధి చెందుతుందని వినియోగదారు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారుల పరిశ్రమ సంఘం (సీఈఏఎంఏ) అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ విభాగాల మార్కెట్ ఐదారేళ్లలో రూ. 2 ట్రిలియన్లకు చేరుకుంటుందని, ఇది ఆర్థిక వ్యవస్థ, దేశీయ మార్కెట్ వృద్ధికి సహాయపడుతుందని సీఈఏఎంఏ కొత్త అధ్యక్షుడు ఎరిక్ బ్రగంజా అన్నారు. పెరుగుతున్న డీమాండ్‌కు అనుగుణంగా పరిశ్రమ సైతం దేశీయంగా పరికరాలను తయారీ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.. దిగుమతులపై ఆధారపడకుండా పీఎల్ఐ పథకం సహాయంతో ఈ సవాళ్లను అధిగమిస్తామని ఎరిక్ బ్రగంజా పేర్కొన్నారు.

గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ పరిశ్రమ ప్రస్తుతం వెనుకబడి ఉందని, దీన్ని త్వరలో బలోపేతం చేయడం, ధరల పోటీని సాధించాలని, తద్వారా వృద్ధి పెంచేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. ఈ రంగంలో భారత్‌ను ప్రధాన తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చడం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి వల్ల పరిశ్రమ కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఈ ఏడాది ఆశాజనకంగా అమ్మకాలను చూశామన్నారు. కరోనా వల్ల పరిశ్రమ ఇప్పటివరకు రూ. 75 వేల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొన్నట్టు అంచనా వేస్తున్నాం.. ఇది ఇన్‌పుట్ ఖర్చులతో పాటు ద్రవ్యోల్భణ ఒత్తిడి వల్ల ఏర్పడింది.. ఇటీవల పరిస్థితులను గమనిస్తే రాబోయే ఆరేళ్లలో ధరల పెరుగుదలను బట్టి రూ. 2 లక్షల కోట్లతో భారీ పరిశ్రమగా మారనున్నామనే నమ్మకం ఉందని ఎరిక్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed