- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ వల్ల మానవ జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. సాధారణ సమయాల్లో ఏమో కానీ, కొన్నిసార్లు టెక్నాలజీ ప్రాణాలను కూడా కాపాడుతుందనడానికి మరో నిదర్శనం దొరికింది. ఇండోర్‌కు చెందిన ఆర్ రంజన్ ప్రాణాలను ఒక ఆపిల్ వాచ్ కాపాడింది. అర్థం కాలేదు కదా..ఆపిల్ వాచ్‌లో ఈసీజీ రిపోర్ట్‌లు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్తే హృదయంలో ఉన్న లోపాన్ని ముందే గుర్తించగలిగి ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఇదే విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు తెలియజేస్తే ఆయన రిప్లై మెయిల్ కూడా చేశారు. తన తండ్రి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం రంజన్ కొడుకు ఆయనకు ఆపిల్ వాచ్ సిరీస్ 5 కొనిచ్చాడు. ఒకరోజు రంజన్‌కు నలతగా అనిపించడంతో ఆపిల్ వాచ్‌లో చెక్ చేసుకోవాలనుకున్నాడు.
ఆ వాచ్ చూపించిన ఈసీజీ రిపోర్ట్‌లో ఆయనకు ఆఫిబ్ అంటే ఆట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య ఉన్నట్లు చూపించింది. రెండు మూడు సార్లు చెక్ చేసినా కూడా అలాగే చూపించింది. హృదయ స్పందనలో మార్పు రేటులో సమస్య ఉంటే ఆట్రియల్ ఫిబ్రిలేషన్ కలుగుతుంది. ఆపిల్ వాచ్ ఈసీజీ రిపోర్ట్‌ను పట్టుకుని డాక్టర్ వద్దకు వెళితే, రంజన్‌కు వెంటనే హార్ట్ సర్జరీ అవసరమని, లేకపోతే ప్రమాదమని చెప్పారు. కొవిడ్ కారణంగా వెంటనే సర్జరీ చేయడం కుదరలేదు. చివరగా జూలైలో సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి, రంజన్ ప్రాణాలకు ప్రమాదం లేకుండా చేశారు. ఆపిల్ వాచ్ తన తండ్రి ప్రాణాలను కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రంజన్ కొడుకు, టిమ్ కుక్‌కు మెయిల్ చేశాడు.