- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజస్థాన్ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. రాజస్థాన్ స్పీకర్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు రాజస్థాన్ హైకోర్టు సూచించడాన్ని బీఎస్పీతోపాటు బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిల్వర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల చేరికను స్పీకర్ అనుమతించడంపై దాఖలైన పిటిషన్ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 24న పక్కన పెట్టింది. స్పీకర్ జోషి తీసుకున్న చర్య ‘నిర్ణయం’ అనే పరిధిలోకి రాదని పేర్కొంది. ఎమ్మెల్యేల చేరిక అక్రమమని ప్రకటించాలని దిల్వర్ తన పిటిషన్‌లో కోరారు.