- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా: మంత్రి
by srinivas |
X
ఆంధ్రప్రదేశ్‌లో పదో పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటించిన తరువాత వాయిదా వేయడం ఇది మూడోసారి. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలాగైనా నిర్వహిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ..పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మరోసారి వాయిదా వేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు కరోనా బాధితులుగా తేలారని, దీనిని మొగ్గలోనే తుంచాలంటే లాక్‌డౌన్ పాటించాలని అన్నారు. అందుకే పదో తరగతి పరీక్షలు మరో రెండు వారాలు వాయిదా వేస్తున్నామని ఆయన ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్ణయించేది, మార్చి 31 తరువాత వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
Tags: 10 exams, corona virus, amaravathi,
Advertisement
Next Story