సోము యూటర్న్.. ఊపిరి పీల్చుకున్న పవన్

by srinivas |
సోము యూటర్న్.. ఊపిరి పీల్చుకున్న పవన్
X

దిశ,వెబ్‌డెస్క్: బీసీనే సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తామంటూ గురువారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు.గురువారం మీడియా సమావేశంలో బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ము సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. కానీ దేశంలో బీసీని ముఖ్యమంత్రిని చేసే అధికారం ఒక్క బీజేపీకే ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలపై ఆయన ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. సీఎం అభ్యర్ధిని ప్రకటించే హక్కు తనకు లేదన్నారు. అంతా కేంద్ర పార్టీ చేతిలోనే ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు జరిపిన తరువాతే ముఖ్యమంత్రి అభ్యర్ధిపై ప్రకటన చేస్తామన్నారు.

అయితే జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను బరిలోకి దిగాల్సి ఉంది. కానీ సోము వీర్రాజు ప్రకటనపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించారు. పొత్తులో ఉండగా బీజేపీ అభ్యర్ధి ఎలా పోటీ చేస్తారని జనసేన ముఖ్య నేతలు సైతం ప్రశ్నించారు. పవన్ జోక్యంతో ఆ వివాదం సర్దుమణిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీకి నిలబెడతామని సోము వీర్రాజు ప్రకటించడం, ఆ ప్రకటనపై జనసేన నేతలు మండిపడడంతో బీజేపీ అధ్యక్షుడు యూటర్న్ తీసుకున్నారు. దీంతో పవన్తో పాటు జనసేన నేతలు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed