‘‘కియా’’పై దుష్ర్పచారం : బుగ్గన

by srinivas |
‘‘కియా’’పై దుష్ర్పచారం : బుగ్గన
X

కియా పరిశ్రమపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బుగ్గన మీడియాతో మట్లాడుతూ… కియా పరిశ్రమ నిర్వాహకులు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు. కియాపై వస్తున్న వార్తలను కంపెనీ యాజమాన్యమే ఖండించిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కియాపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తప్పుడు ప్రచారంతో రాష్ర్టానికి నష్టం జరుగుతోందన్నారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.14వేల కోట్ల పెట్టుబడితో కియా ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. పరిశ్రమలశాఖ నుంచి కియాకు పూర్తి హకారం అందించామని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు అడిగిన వసతులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారన్నారు. ఏపీలో పెట్టుబడులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, త్వరలోనే ఏపీలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టబోతున్నాయన్నారు. గత ప్రభుత్వం రూ.60వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి, రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed