ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై తీర్పు వాయిదా

by srinivas |
ap high court
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్నికల రీ నోటిఫికేషన్ పై జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఆ పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గత ఏడాది జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి రీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఎస్ఈసీని ఆదేశించాలని జనసేన కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపించారు. అప్పుడు నామినేషన్ వేయలేకపోయిన వారు, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్న వారు అందజేసిన వివరాల్ని పరిగణనలోకి తీసుకుని కలెక్టర్​లు నివేదికలు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 18న ఎస్​ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలపైనా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఏకగ్రీవాల్లో ఫామ్ 10 ఇచ్చిన చోట విచారణ జరపవద్దని.. విచారిస్తే ఫలితాలు వెల్లడించవద్దని ఎస్ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పిటిషన్​పై సోమవారం వాదనలు విన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed