- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివేకా కేసును సీబీఐకి అప్పగించండి: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేదని హైకోర్టు మండిపండింది. కేసు దర్యాప్తు సమయం కీలకం కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని సూచించింది.
వివేకా హత్య కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని ఉన్నత న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. అలా జరిగితే ఇతర రాష్ట్రాలలోని నేరస్థులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు సీబీఐకి ఉన్నాయని కేసును విచారించిన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ కేసును పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచే సీబీఐ దర్యాప్తు ఆరంభించాలని హైకోర్టు సూచించింది. సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం కేసుపై ఉండకూడదని చెప్పిన న్యాయస్థానం విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశించింది.
కాగా వివేకానందరెడ్డి 2019 మార్చిలో తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. సౌమ్యుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరొందిన వ్యక్తిని అంత దారుణంగా హత్య చేయడం ఎలా సాధ్యమైందని అప్పట్లో ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో అంతా పులివెందుల టీడీపీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేత బీటెక్ రవి సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసు విచారణకు వచ్చింది.
Tags: andhrapradesh high court, ys viveka murder case, cbi