ఏపీ హైకోర్టులో తొలి మహిళా రిజిస్ట్రార్

by srinivas |   ( Updated:2020-06-23 00:23:14.0  )
ఏపీ హైకోర్టులో తొలి మహిళా రిజిస్ట్రార్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ (ఆర్‌జీ)గా విశాఖపట్టణం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి బీఎస్ భానుమతి నియమితులయ్యారు. తద్వారా ఏపీ హైకోర్టు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్‌గా ఆమె రికార్డులకెక్కారు. హైకోర్టు విభజన అనంతరం చీకటి మానవేంద్రనాథ్ హైకోర్టు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆరు నెలల తర్వాత ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో… ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రిజిస్ట్రార్ అయిన బి.రాజశేఖర్ ఇప్పటి వరకు రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో.. ఆ బాధ్యతల్లో బీఎస్ భానుమతిని నిమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆమె ఈ నెల 30వ తేదీ లోపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed