కొవిడ్ ఉండగా భూముల వేలం ఏంటి?.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

by srinivas |
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కొవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్ధించిన హైకోర్టు.. కొవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ జులై 7వ తేదీకి వాయిదావేసింది.

Advertisement

Next Story

Most Viewed