- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా బేసిన్‌లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ కృష్ణా జిల్లా రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జీవో 34 పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ వినోద్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణను సీజే ధర్మాసనం ఎదుట ఉంచాలని ఏజీ కోరారు. రైతుల పిటిషన్‌పై విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం తెలిపింది. ఏజీ స్థాయి అధికారి నుంచి ఇలాంటి అభ్యంతరం వ్యక్తంకావడం సరికాదని అభిప్రాయపడింది.
చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట విచారించాలనడం… తమ ధర్మాసనంపై దాడేనని వ్యాఖ్యానించింది. అనంతరం రైతుల పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన జస్టిస్ రామచంద్రరావు అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించింది. రాజోలిబండపై సుప్రీం తీర్పును అధ్యయనం చేయాలని పిటిషనర్‌ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మంగళవారం వాదనలు వినిపించాలని చెబుతూ విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తి… ఇంధనశాఖ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని కృష్ణా జిల్లా రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడొద్దని అభ్యంతరం తెలిపారు.