- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..వారందరికీ పండగే
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది.
ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జీవోతో కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్యులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇదే సమయంలో జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ మరో రెండు జీవోలను విడుదల చేసింది.
Advertisement
- Tags
- ap
- EWS
- Government
Next Story