వాటి నిర్మాణానికి తిరుపతి ఐఐటీ సహకారం..

by srinivas |
వాటి నిర్మాణానికి తిరుపతి ఐఐటీ సహకారం..
X

దిశ, ఏపీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదల గృహ నిర్మాణం కోసం తిరుపతి ఐఐటీతో ఒప్పందం చేసుకుంది. గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్​ సిబ్బందితోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఆన్​లైన్​ శిక్షణ నాలుగు రోజులపాటు కొనసాగుతుంది. గురువారం ప్రారంభమైంది. మొత్తం 1100 మంది వివిధ స్థాయి ఇంజనీర్లకు బృందాలుగా శిక్షణ ఇస్తున్నారు. ఆయా జిల్లాల గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల నుంచి ఆన్​లైన్​ శిక్షణలో పాల్గొంటారు.

ప్రభుత్వం నాలుగేళ్లలో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటి విడత 15 లక్షల ఇళ్లు నిర్మించనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ విస్తీర్ణంలో ఈ గృహాలను నిర్మిస్తారు. గదుల్లో ఎక్కువ వేడి లేకుండా ఉండేట్లు ప్రత్యేక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇంజనీర్లకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. దీనికి సంబంధించి తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎస్​సత్యనారాయణ మాట్లాడుతూ సివిల్​, పర్యావరణ రంగాలకు సంబంధించిన సీనియర్​శాస్ర్తవేత్తలతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆన్​లైన్​శిక్షణ అనంతరం ఐఐటీ ప్రాంగణంలోని పరిశోధన శాలల్లో రూపొందించిన ముడి పదార్థాలు, వాటి నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఇంజనీర్లకు అవగాహన కల్పిస్తామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్​జైన్​, ఎండీ నవీన్​కుమార్​వెల్లడించారు. ఇంజనీర్లకు శిక్షణ అనేది నిరంతరం కొనసాగుతుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed