- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్యాస్ లీకేజీ బాధితులకు 30 కోట్లు విడుదల
X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు జీవీ జారీ అయింది. ముఖ్యమంత్రి వైజాగ్‌లో ప్రకటించిన ప్రకారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, రెండు లేదా మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిన వారికి లక్ష రూపాయలు, వెంకటాపురం గ్రామస్థులకు ఇంటికి 25 వేల రూపాయలు సాయం అందించాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట 30 కోట్లు విడుదల చేసినట్టు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు.
Advertisement
Next Story