జిల్లా ఎంపిక కమిటీలో కీలక మార్పులు..

by srinivas |
జిల్లా ఎంపిక కమిటీలో కీలక మార్పులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగుల ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షించే జిల్లా ఎంపిక కమిటీలో ఏపీ ప్ర‌భుత్వం కీలక మార్పులు చేసింది. వివిధ శాఖల ఉన్నతాధికారులను జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ మంగ‌ళ‌వారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నూతనంగా బాధ్యతలు అప్పగించిన జాయింట్ కలెక్టర్లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. గ్రామ, వార్డు సచివాలయ జేసీలతో పాటు రైతు భరోసా, రెవెన్యూ జేసీలను కూడా జిల్లా ఎంపిక‌ కమిటీలో నియమిస్తున్న‌ట్లు వెల్లడించింది. సంక్షేమ బాధ్యతలు చూసే మరో జాయింట్ కలెక్టర్‌ను కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed