గుడ్ న్యూస్.. వ్యాక్సినేషన్‌పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by Anukaran |
Corona Vaccination
X

దిశ, ఏపీ బ్యూరో : కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి అంశం ఇప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారి తీసింది. రెండు డోసుల మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉంటే మరిన్ని వేరింయట్లు వచ్చే అవకాశం ఉందని కొందరు.. వ్యవధి ఉండాలని మరికొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్‌ రెండో డోసును 84 రోజుల తర్వాత పొందాలి. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed